Bharat Aawaz

డిస్మిస్ కార్మికుల విషయంలో యాజమాన్యాన్ని నిలదీయడంలో విఫలమైన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు!

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
27
Views

సింగరేణి డిస్మిస్ కార్మికులకు తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం విధించిన రెండేళ్ల నిబంధనలపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యాన్ని నిలదీయడంలో విఫలమయ్యాయనే విమర్శలు కార్మిక వర్గాల్లో వినిపిస్తున్నాయి.కార్మికుల పక్షాన నిలబడాల్సిన సంఘాలు.. బాధితుల ఆవేదనను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి నిబంధనల సడలింపునకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు.కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిస్మిస్ కార్మికులకు న్యాయం జరిగేలా సంఘాలు చొరవ తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.