Bharat Aawaz

షేక్‌పేట్‌లో గుర్రం మాయం.. జీహెచ్ఎంసీకి మౌనం.?

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
35
Views

● సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాలు

● ఒకటి మాయం.. వివరణ ఇవ్వని జీహెచ్ఎంసీ అధికారులు

అల్వాల్,నవంబర్5:హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాల్లో ఒకటి మాయమైంది. 

మూడు గుర్రాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం రెండు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహమే కనిపించకుండా పోవడం స్థానికంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

అసలు గుర్రం విగ్రహం ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? లేక తొలగించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మూడు గుర్రాల్లో ఒకటి మాయమైతే మిగిలిన రెండింటి సంగతేంటని పలువురు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. 

నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహాల పరిరక్షణ బాధ్యత ఎవరిదో అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

#Sidhumaroju

Alwal