Bharat Aawaz

పత్తికొండలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు

Sureshachari Kammara
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
70
Views

పత్తికొండ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతతో కూడిన హక్కు అని పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్తికొండ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటుకు ఎంతో విలువ, ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్థానిక సంస్థలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, ప్రజల తీర్పును శిరసావహించడమే ఎన్నికల అసలైన స్ఫూర్తి అని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు పేర్కొన్నారు.