Bharat Aawaz

గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సుభాష్

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
53
Views

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటైంది. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అసోసియేషన్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ లతీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సుభాష్, కోశాధికారిగా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర కౌన్సిలర్లుగా జి. హనుమండ్లు, జి. సునీత నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరియు వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.