Bharat Aawaz

పలాసలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
217
Views

  • యువత భవిష్యత్తుకు, రాష్ట్ర వికాసానికి ఓటే పునాది
  • కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే విశ్వాసం

 

పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలాస టీడీపీ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష తన భర్త వెంకన్న చౌదరితో కలిసి పలాసలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఓటు అనేది యువత భవిష్యత్తుకు, రాష్ట్ర వికాసానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రజల ఆశీస్సులతో కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తారని, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని ఎమ్మెల్యే గౌతు శిరీష పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.