Bharat Aawaz

ఆసిఫాబాద్‌లో మహిళల సమస్యకు సత్వర పరిష్కారం కాట్కార్ భీంరావ్, షేక్ కలీమ్‌లకు కృతజ్ఞతలు

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
64
Views

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురంభీం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మహిళల సమస్యకు స్థానిక నాయకులు సత్వర పరిష్కారం చూపి తమ ఉదారతను చాటుకున్నారు. స్థానిక మహిళలు ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆడుకునే సాంప్రదాయ జానపద ఆట ‘భూలాయి’ (బతుకమ్మ తరహా ఆట) ఆడే ప్రదేశం బురదమయంగా మారడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మహిళలు తమ నాయకుడు, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు కాట్కార్ భీంరావ్ గారిని సంప్రదించారు.

మహిళల సమస్యపై వెంటనే స్పందించిన భీంరావ్, తన మిత్రుడు మరియు మైనారిటీ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న షేక్ కలీమ్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానవతా దృక్పథంతో స్పందించారు. తన సొంత ఖర్చులతో వెంటనే ఒక ట్రాక్టర్ ఇసుకను తెప్పించి, బురదగా ఉన్న భూలాయి ఆట స్థలాన్ని పూర్తిగా చదును చేయించారు.

దీంతో స్థానిక మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. తమ సమస్యను వెంటనే పరిష్కరించి అండగా నిలిచిన నాయకులు కాట్కార్  భీంరావ్ గారికి, షేక్ కలీమ్ గారికి 1వ వార్డు మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. మహిళల సంతోషమే తమకు ముఖ్యమని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.