Bharat Aawaz

తెలంగాణ యాసపై జిమ్మిక్కులా? లేక కథలో దమ్ముందా? — శ్రీను రావు పొన్నాల

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
228
Views

పెళ్లిలో తినేవాళ్లు, తాగేవాళ్లు ఉండటం అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ తెలంగాణ యాస, భాష, సంస్కృతి పేరుతో మనల్ని మనమే సినిమాల్లో కించపరచుకోవడం ఎంతవరకు సమంజసం?

 

రచయితలు, దర్శకులారా! తెలంగాణ యాస మీకు కామెడీ వస్తువు కాదు.. అది మా ఆత్మగౌరవం, మా అస్తిత్వం! మా భాషను వక్రీకరించి, మా సంస్కృతిని అవమానించి, చీప్ జోకులతో చప్పట్లు కొట్టించుకోవడం గొప్పతనం కాదు. మీ జిమ్మిక్కులు కాదు.. మీ కథలోని బలమే మీ ప్రతిభకు కొలమానం!

 

గుర్తుంచుకోండి.. ప్రచారంతో సినిమాను విడుదల చేయవచ్చు, జిమ్మిక్కులతో మొదటి రోజు ప్రేక్షకులను రప్పించవచ్చు. కానీ కథలో దమ్ము లేకపోతే ప్రేక్షకుల తీర్పు ముందు ఏ హడావుడీ నిలబడదు. ఉదయం విడుదలైన సినిమా సాయంత్రానికే థియేటర్లలో వెలవెలబోవచ్చు!

 

తెలంగాణను చూపించండి.. కానీ కించపరచకండి. తెలంగాణ యాసను వినిపించండి.. కానీ అవమానించకండి. మా సంస్కృతిని తెరపై నిలబెట్టండి.. చులకన చేయకండి!