Bharat Aawaz

వరుస నేరాలు.. పిడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
4 min read
0
Comments
18
Views

● 18 ఏళ్లలో 64 నేరాలకు పాల్పడిన డేరంగుల రవి

● దోపిడీలు, చోరీలు, ఆయుధాలతో దాడులకు పాల్పడిన నిందితుడు

● చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు

అల్వాల్,అక్టోబర్26:సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వరుసగా ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. 

సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన డేరంగుల రవి అలియాస్‌ గజ అలియాస్‌ గజ దొంగను గూండాగా పరిగణిస్తూ, భవిష్యత్తులో మరిన్ని నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు ముందస్తు నిర్బంధ చట్టం కింద చర్యలు తీసుకున్నారు. నిందితుడిని మేడ్చల్ జిల్లాలోని చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డేరంగుల రవి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. పాదచారులను, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించే వారిని లక్ష్యంగా చేసుకుని, శారీరకంగా హాని చేస్తామని లేదా చంపుతామని బెదిరించి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను బలవంతంగా లాక్కునేవాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కత్తులు, ఇతర ప్రమాదకర ఆయుధాలతో దాడులకు పాల్పడేవాడు.

రాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. అనంతరం ప్రధాన ద్వారాలను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను దొంగిలించేవాడు. ఇళ్ల బయట పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలను కూడా లక్ష్యంగా చేసుకుని అపహరించేవాడు. 

ఈ విధంగా దోపిడీలు, బెదిరింపులతో వసూళ్లు, ఇళ్లలో చోరీలు, ఆయుధాలతో దాడులు తదితర నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

సూరారం కాలనీ, జీడిమెట్లలోని దయానంద్‌ నగర్‌కు చెందిన డేరంగుల రవి (24), తండ్రి డేరంగుల గోపాల్‌. 2008 నుంచి 2026 వరకు అతను మొత్తం 64 నేరాల్లో ప్రమేయం కలిగి ఉన్నట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. 

సూరారం పోలీసులు అతడిని గతంలో అరెస్టు చేసి జైలుకు పంపగా, తదుపరి నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు తాజాగా పీడీ యాక్ట్‌ కింద నిర్బంధించారు.

#Sidhumaroju

Alwal