Bharat Aawaz

మంచిర్యాల జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలి కాళేశ్వరం జోన్ ఐజీకి బీజేపీ నేతల వినతి

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
33
Views

హైదరాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలిసి కాళేశ్వరం జోన్ ఐజీని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, వీటి కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని రఘునాథ్ వెరబెల్లి ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.బతుకమ్మ పండుగ రోజున దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన ఘర్షణ, దసరా రోజున లింగాపూర్‌లో చోటుచేసుకున్న ఘటన, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో జరిగిన సంఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో పోలీసు బందోబస్తు, పహారా కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయన్న అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై విచారణ అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రఘునాథ్ వెరబెల్లి ఐజీని కోరారు.