0
Comments
8
Views
అక్షిత అకాల మరణం తీవ్ర విషాదకరం – మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి.
అమెరికాలో గుండెపోటుతో అకాల మరణం చెందిన ఖమ్మం యువతి నల్లమల అక్షిత మృతి పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శనివారం ఖమ్మంలో అక్షిత తండ్రి, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు నల్లమల ఆనంద్ దంపతులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న సమయంలో అక్షిత అకాల మరణం చెందడం హృదయవిదారకమని పేర్కొన్నారు. చేతికందిన కుమార్తెను కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని లోటని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. అక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ పరామర్శలో ముత్యాల అప్పారావు, బానోత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.