Bharat Aawaz

రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

Sriramula Anil
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
73
Views

శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఏఇఓ అన్వేష్ ఆధ్వర్యంలో రైతులకు *ఖేతి భచావో అభియాన్* కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పు దినుసులు, నూనె గింజలు, ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని తెలిపారు.

పంటలు కోసిన తర్వాత వాటి అవశేషాలు, పంట వ్యర్థాలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, వాటిని భూమిలోనే కలుపుకోవాలని సూచించారు.రైతులు మట్టి పరీక్షలు చేయించుకుని, వాటి ఆధారంగా మాత్రమే ఎరువులను వాడాలని తెలిపారు. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా భూమి చౌడుబారకుండా, నేల ఆరోగ్యం మెరుగుపడి దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు.పంటలకు కాలువల ద్వారా కాకుండా డ్రిప్ (బిందు సేద్యం) లేదా స్ప్రింక్లర్ ద్వారా నీరు అందించాలని, తద్వారా నీటి ఆదా, ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మసికె కుమారస్వామి,ఆత్మ కమిటీ మెంబర్ దూదిపాల నర్సింహారెడ్డి,రైతులు పాల్గొన్నారు.