Bharat Aawaz

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: మర్రి రాజశేఖర్ రెడ్డి.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
6 min read
0
Comments
30
Views

● ఎమ్మెల్సీ ఎన్నికల నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

● తాగునీటి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపైనా సమీక్ష

అల్వాల్,అక్టోబర్23:మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

గురువారం బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదు పురోగతితో పాటు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై చర్చించారు.

ప్రతి డివిజన్ పరిధిలోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు నిబంధనలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన పత్రాలతో ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కు పొందేలా పార్టీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాల లభ్యత తగ్గడంతో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బోర్ల నిర్వహణపై శ్రద్ధ వహించడంతో పాటు కొత్త బోర్లు వేయాల్సిన సందర్భాల్లో సంబంధిత నిబంధనల ప్రకారం ఎమ్మార్వోల ద్వారా అనుమతులు పొందే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. బోర్‌వెల్లకు మీటర్ల ఏర్పాటు, నీటి సరఫరా సమయాల్లో మార్పులు, నీటి కొరత కారణంగా అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిజమైన పేదలను గుర్తించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ద్వారా గృహ వసతి అందేలా సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇళ్లకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్హులకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, మౌలిక సదుపాయాలు, తాగునీరు, గృహ వసతి వంటి ప్రజావసరాలపై నిరంతరం దృష్టి సారించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఓటరు నమోదు కార్యక్రమంతో పాటు ప్రజా సమస్యలపైనా బాధ్యతగా వ్యవహరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, శిరీష జితేందర్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, జీ.కే. హనుమంతరావు, అనిల్ కిషోర్ గౌడ్, మేకల రాము యాదవ్, జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, అరుణ్ రావు, సురేష్, భాస్కర్ రెడ్డి, శోభన్ బాబు, మహేష్, శ్రీనివాసులు, ప్రభాకర్ గౌడ్, కేబుల్ రమేష్, సయ్యద్ మోసిన్, మా శెట్టి అనిల్, కిరణ్ ముదిరాజ్, సంపత్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, చిందం శ్రీనివాస్, ఉస్మాన్, ఫరీద్, గౌస్ ఇమ్రాన్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, ముత్యాలు, అజయ్ గౌడ్, తిరుపతి రావు, శివ సాయి యాదవ్, జే.కే. సాయి కృష్ణ గౌడ్, శ్రీరాములు, బిక్షపతి మణిరత్నం, విజయ్ శేఖర్, శోభా, పుష్ప, ఆరిఫ్, రెహ్మత్ ఖాన్, అరవింద్, సతీష్, రమేష్, బాలకృష్ణ, నవీన్, నర్సింగ్ రావు, వినీత్, లీలా, నందిని తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal