Madanapalle: మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు నవరాత్రుల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
0
Comments
101
Views
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహించారు. సంతాన లక్ష్మి అమ్మవారు సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖసంతోషాలు, శ్రేయస్సుకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి కరుణతో కుటుంబాల్లో ఆనందం, ఐక్యత, సుఖశాంతులు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థిస్తారు.