Bharat Aawaz

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
100
Views

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీరామ్ చినబాబు మదనపల్లె రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చైర్మన్ అభ్యర్థిత్వం కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆయన అభ్యర్థిత్వం ప్రాధాన్యత సంతరించుకుంది. మదనపల్లె మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి బీసీ జనరల్ రిజర్వేషన్ ఖరారైన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం శ్రీరామ్ చినబాబును ఎంపిక చేసింది. శ్రీరామ్ చినబాబు అభ్యర్థిత్వంతో మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ గెలుపుపై పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.