ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర

0
1K

 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వద్ద రథయాత్రను మంత్రి సీతక్క ప్రారంభిస్తారు. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద యాత్రగా నిలవనుందని ఇస్కాన్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వినర్ వరద కృష్ణ దాస్ తెలిపారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొననుండగా, 5 వేల మంది వాలంటీర్లు, వెయ్యిమందికి పైగా వంట సిబ్బంది సిద్దమైయ్యారు. ‘‘నారీ శక్తి"ని ప్రోత్సహించేందుకు మహిళలకు, పిల్లలకు ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం లాంటి విలువలు ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి చేరతాయి’’ అని నిర్వాహకులు వెల్లడించారు.... ఈ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుండి బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్ టీటీడీ, బషీర్‌బాగ్ మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో ముగియనుంది.  రథయాత్ర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర ఆధ్యాత్మిక నాయకులు పాల్గొననున్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com