Bharat Aawaz

ములగాడ టిడ్కో ‘ఎ’ బ్లాక్ లబ్ధిదారులకు తాళాల అందజేత.. సకల వసతులతో గృహప్రవేశం కల్పించిన ప్రభుత్వ విప్ గణబాబు

Santhosh Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
114
Views

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ములగాడ పరిధిలోని ఏపీ టిడ్కో గృహ సముదాయంలో ‘ఎ’ బ్లాక్ (Block-A) లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, గౌరవ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ఇంటి తాళాలను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేవలం రూ.500 నామమాత్రపు రుసుముతో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్ సదుపాయంతో మంజూరు చేశామని గుర్తుచేశారు. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల ఐదేళ్లపాటు పనులు నిలిచిపోయి లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఆరు నెలల క్రితమే మిగతా బ్లాకులను అప్పగించినప్పటికీ, ‘ఎ’ బ్లాక్‌లో రెండుసార్లు విద్యుత్ వైర్లు చోరీకి గురికావడంతో జాప్యం తప్పలేదన్నారు. కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయించి, విద్యుత్, తాగునీరు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) వంటి సంపూర్ణ మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఈరోజు నిజమైన గృహప్రవేశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత సకల సౌకర్యాలతో సొంతింటి తాళాలు అందుకున్న పేద లబ్ధిదారులు ఎమ్మెల్యే గణబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.