Bharat Aawaz

ఏపీ పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
108
Views

 

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీలో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు సహకరించాలని విజ్ఞప్తి

మూలపేట, దుగరాజపట్నం పోర్టుల అభివృద్ధిపై కీలక చర్చ

పోర్టుల అనుబంధ రంగాలతో ఉపాధి కల్పన పెరుగుతుందని వివరణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు, పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.

 

ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టులో కొత్తగా టెర్మినల్ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు కేంద్రమంత్రికి వివరించారు.