Bharat Aawaz

ఖమ్మంలో మహిళా శక్తి కెంటీన్ ప్రారంభం: స్వయం ఉపాధి దిశగా మహిళల మరో అడుగు!

Kotha Srikanth
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
202
Views

ఖమ్మం నగరంలో మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధే లక్ష్యంగా మరో సరికొత్త అడుగు పడింది. మమత రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన **‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’**ను మెప్మా (MEPMA)-ఖమ్మం నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య IAS గారు అధికారికంగా ప్రారంభించారు.

ఈ క్యాంటీన్‌ను మాధురి అనే మహిళ నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయబడింది. ఒక క్యాంటీన్‌తో ప్రారంభమైన ఈ చిన్న ప్రయత్నం ఒక మహిళకు ఉపాధిని, ఒక కుటుంబానికి భరోసాను ఇవ్వడమే కాకుండా, మరెందరో మహిళలకు స్పూర్తిగా నిలవనుంది.

ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి గౌరవంగా జీవించేలా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఖమ్మం నగర పాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. మహిళల ఆర్థిక సాధికారతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.