Bharat Aawaz

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34% బీసీ రిజర్వేషన్లు రద్దు!

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
120
Views

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 1065లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈ జీవోలు ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేసింది. 

 

ఆరు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.