Bharat Aawaz

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం

Patan Khuddus
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
213
Views

🟢ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం

నందిగామ, సెప్టెంబర్ 28: కృష్ణా–గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి సంబంధించి ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థి ఎం. హనుమంతరావు తరఫున నందిగామ రైతుపేటలోని కంచర్ల సుబ్బారావు భవన్‌లో సోమవారం ఓటర్ల నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఉచితంగా ఆన్‌లైన్ సేవలు

కంచర్ల వైకుంఠేశ్వర సత్యనారాయణ ప్రసాద్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఫామ్-19ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ఈ కేంద్రంలో ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నవంబర్ 6 వరకు నమోదు

2020 నవంబర్ 1 నుంచి 2026 అక్టోబర్ 31 మధ్య ఆరు సంవత్సరాల సర్వీస్‌లో కనీసం మూడు సంవత్సరాలు ఉన్నత పాఠశాల లేదా కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నందిగామ, చందర్లపాడు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెంటమాల రామారావు, బిట్టు సత్యనారాయణ, ఎం.వి.ఎస్.ఎన్. బెనర్జీ, గడ్డం లక్ష్మీనారాయణ, యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శులు బొద్దుకోలు రమణయ్య, జంగాల గంగరాజు, చిన్నం నరసింహారావు, దేవర శ్రీనివాసరావు, జి. జక్కన్నచార్యులు, ఎం. కోటేశ్వరరావు, విజయలక్ష్మి, షేక్ నాగులు మీర తదితరులు పాల్గొన్నారు.