Bharat Aawaz

తిరుపతి వేదికగా అఖిల భారత డీజీపీల సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
178
Views

 

Andhra

 

డిసెంబర్‌లో తిరుపతి వేదికగా 61వ అఖిల భారత డీజీపీల సదస్సు

హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా

పాల్గొననున్న దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు 

తిరుపతి ఐసర్ క్యాంపస్‌లో ఈ కీలక సమావేశం

ప్రతిష్ఠాత్మక 61వ అఖిల భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల సదస్సుకు తిరుపతి జిల్లా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. జాతీయ భద్రత, పోలీసు వ్యవస్థ పనితీరు వంటి కీలక అంశాలపై చర్చించే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

 

తిరుపతి జిల్లాలోని ఏర్పేడు సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) ప్రాంగణం ఈ సదస్సుకు వేదిక కానుంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొంటారు.

 

ఈ సదస్సులో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర నిఘా సంస్థల అధిపతులు పాల్గొని దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ఐపీఎస్ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. జాతీయ స్థాయిలో ఇంతటి కీలకమైన సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.