Bharat Aawaz

చెరువుల పరిరక్షణపై HYDRA కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
176
Views

● అల్వాల్‌ చెరువుల అభివృద్ధిపై హైడ్రా కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ

● పూడికతీత, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణకు ప్రతిపాదన

● ఆక్రమణల నివారణ, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

మల్కాజ్‌గిరి, సెప్టెంబర్ 21: అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువుతో పాటు పరిధిలో ఉన్న ఇతర చెరువులను సమగ్రంగా పునరుజ్జీవింపజేసి, సుందరీకరణకు చర్యలు చేపట్టాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. 

ఈ మేరకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRA) కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను కలిసి చెరువుల పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

చిన్నరాయుని చెరువుతో పాటు ఇతర జలవనరుల పూడికతీత చేపట్టడంతో పాటు నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు. 

చెరువుల పరిధిలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి చేయాలని కోరారు.

వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చెరువుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా స్థానికంగా వరద నీటి సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

అదే సమయంలో జలవనరుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యతకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అల్వాల్‌ ప్రాంతంలోని చెరువుల అభివృద్ధికి HYDRA నుంచి అవసరమైన సహకారం అందించాలని మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

దీనిపై కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలపై పరిశీలిస్తామని తెలిపారు.

#Sidhumaroju

Alwal