Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్ల సాధన కోసం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె ఆరో రోజుకు చేరింది.

0
16

Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లె మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఆరో రోజుకు చేరింది. మదనపల్లె మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలు, అటెండర్లు, వాచ్‌మెన్లు, రికార్డు అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సిరివెళ్ల గురు ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు ఆవుల రమణ, రెడ్డప్ప, శాంతకుమార్, నాన్సీ, ఉష, గౌసియా, భాగ్యమ్మతో పాటు పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...
By Chennaiah Kati 2026-07-14 19:23:51 0 148
Telangana
𝗦𝗮𝗶𝗳𝗮𝗯𝗮𝗱 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 & 𝗖𝗖𝗦 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗧𝘄𝗼 𝗦𝗲𝗿𝘃𝗮𝗻𝘁 𝗧𝗵𝗲𝗳𝘁 𝗢𝗳𝗳𝗲𝗻𝗱𝗲𝗿𝘀 – 𝗝𝗲𝘄𝗲𝗹𝗹𝗲𝗿𝘆 𝗪𝗼𝗿𝘁𝗵 ₹𝟭.𝟱 𝗖𝗿 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
Hyderabad:  Saifabad Police, in coordination with CCS Hyderabad, arrested two offenders...
By Sidhu Maroju 2025-09-11 14:57:27 0 345
Telangana
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్‌ మృతి
వరంగల్‌ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17...
By Bheeshman King 2026-07-08 12:40:21 0 1K
Telangana
పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!
పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు....
By Sunka Santhosh 2026-04-27 19:14:31 0 260
Telangana
చట్టాల పట్ల గౌరవం పెంచే "ఫీల్ ది జైలు" కార్యక్రమం
హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు...
By Akshay Goud 2026-06-12 13:12:33 0 631
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com