మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌లో విద్యార్థులతో కలిసి టిఫిన్.. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
11

మంచిర్యాల: తన జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఆత్మీయంగా జరుపుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే.. విద్యార్థులతో కలిసి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అందిస్తున్న ఉచిత అల్పాహారాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య తన పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైన అనుభూతి అని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

విద్యార్థులతో కలిసి గడిపిన ఈ ఆత్మీయ క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ మరువలేని జ్ఞాపకంగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
Kerala Free Travel: 'Priyadarshini' Bus Scheme Rolls Out
The Kerala State Transport Department is closely monitoring the successful initial rollout of its...
By Lokeshwari Panthadi 2026-06-30 09:29:24 0 90
Andhra Pradesh
చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!
Andhra Union Minister Ashwini Vaishnaw Asks CM Chandrababu Mobile Details విశాఖలో గూగుల్ క్లౌడ్...
By Pagadala Venkateswar 2026-04-29 05:28:20 0 148
Andhra Pradesh
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-17 06:17:18 0 715
Bharat Aawaz
Union Home Minister Amit Shah’s Visit to Hyderabad for “Adhikara Basha” Celebration
In a significant move to energize party workers and assert the cultural and political identity of...
By Bharat Aawaz 2025-07-09 13:25:02 0 1K
Telangana
పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ వద్ద BRS నేతల నిరసన..!
రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి...
By Sunka Santhosh 2026-06-09 18:32:19 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com