ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి :  ఎం వి వి రమణమూర్తి 

0
25

 

చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మారోజు వెంకట రమణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుండి బదిలీ పై చింతూరు లో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాల్లో సైతం తపాలా శాఖ కార్యాలయాలు నెలకొల్పి ప్రజలకు ఎన్నో విధాలైన సేవలను అందజేస్తున్నదని.. దట్టమైన అడవులు గిరిజన గ్రామాల కలిగిన చింతూరు ఏజెన్సీలో తపాలా శాఖ పథకాలను ప్రోత్సహించేందుకు రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపర్డెంట్ కోట శేషారావు ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారన్నారు. గ్రామీణ పొదుపును ప్రోత్సహించే ప్రక్రియ లో భాగంగా చిన్న మొత్తాల పొదుపు ఖాతా లను గ్రామ స్థాయి లో సేకరించడం జరుగుతుందనీ.. మహిళలు మరింతగా తపాలా పొదుపు ఖాతా లు ప్రారంభించేందుకు వారిని ప్రోత్సహించాలన్నారు. తపాలా సిబ్బంది గ్రామస్థాయిలో ప్రజలకు చేరువగా వారికి అందుబాటులో ఉంటారని అన్నారు. పోలవరం పరిహారం భద్రం గా దాచుకోండి. దేశవ్యాప్తం గా నెట్ వర్క్ కలిగి వున్న తపాలా శాఖ లో పెద్ద మొత్తం లో ఫిక్సిడ్ డిపాజిట్ లు చేయడం వలన అధిక వడ్డి పొందవచ్చని... ఈ ప్రాంతం లోని పోలవరం నిర్వశితులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భీమా రంగం లోనూ తపాలా శాఖ దే ప్రాధాన్యత తపాలా జీవిత భీమా ప్రజల నమ్మకాన్ని ఎంత గానో చూరకొన్నదని.. సరళమైన తపాలా భీమా పధకాలు గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి అన్నారు. ఇండియన్ పోస్ట్ బ్యాంక్ పథకం ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నగదు నేరుగా గ్రామీణ ప్రజల ఖాతాల్లోకి చేరుతుందని, ఉపాధి హామీ పథకం వేతనాలు సైతం నేరుగా జమ అవుతుందని వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు సైతం తపాలా శాఖ ప్రాధాన్యతను ప్రజలకు వివరించి వారు మరింతగా తపాలా సేవ లను పొందేందుకు సహకరించాలని కోరారు. చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ మూర్తికి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా...రాజమండ్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనివాసరావు, రంపచోడవరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ లు తమ అభినందనలు తెలియజేశారు .

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 224
Andhra Pradesh
మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.
మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని...
By Pagadala Venkateswar 2026-04-11 06:16:07 0 156
Andhra Pradesh
పుంగనూరులో HPV టీకా కార్యక్రమం ప్రారంభం
పుంగనూరులో బుధవారం గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్...
By Kothuru Murali 2026-03-11 11:11:34 0 181
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 200
Andhra Pradesh
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!
    APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!...
By Pagadala Venkateswar 2026-02-10 04:35:19 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com