ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి :  ఎం వి వి రమణమూర్తి 

0
29

 

చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మారోజు వెంకట రమణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుండి బదిలీ పై చింతూరు లో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాల్లో సైతం తపాలా శాఖ కార్యాలయాలు నెలకొల్పి ప్రజలకు ఎన్నో విధాలైన సేవలను అందజేస్తున్నదని.. దట్టమైన అడవులు గిరిజన గ్రామాల కలిగిన చింతూరు ఏజెన్సీలో తపాలా శాఖ పథకాలను ప్రోత్సహించేందుకు రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపర్డెంట్ కోట శేషారావు ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారన్నారు. గ్రామీణ పొదుపును ప్రోత్సహించే ప్రక్రియ లో భాగంగా చిన్న మొత్తాల పొదుపు ఖాతా లను గ్రామ స్థాయి లో సేకరించడం జరుగుతుందనీ.. మహిళలు మరింతగా తపాలా పొదుపు ఖాతా లు ప్రారంభించేందుకు వారిని ప్రోత్సహించాలన్నారు. తపాలా సిబ్బంది గ్రామస్థాయిలో ప్రజలకు చేరువగా వారికి అందుబాటులో ఉంటారని అన్నారు. పోలవరం పరిహారం భద్రం గా దాచుకోండి. దేశవ్యాప్తం గా నెట్ వర్క్ కలిగి వున్న తపాలా శాఖ లో పెద్ద మొత్తం లో ఫిక్సిడ్ డిపాజిట్ లు చేయడం వలన అధిక వడ్డి పొందవచ్చని... ఈ ప్రాంతం లోని పోలవరం నిర్వశితులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భీమా రంగం లోనూ తపాలా శాఖ దే ప్రాధాన్యత తపాలా జీవిత భీమా ప్రజల నమ్మకాన్ని ఎంత గానో చూరకొన్నదని.. సరళమైన తపాలా భీమా పధకాలు గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి అన్నారు. ఇండియన్ పోస్ట్ బ్యాంక్ పథకం ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నగదు నేరుగా గ్రామీణ ప్రజల ఖాతాల్లోకి చేరుతుందని, ఉపాధి హామీ పథకం వేతనాలు సైతం నేరుగా జమ అవుతుందని వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు సైతం తపాలా శాఖ ప్రాధాన్యతను ప్రజలకు వివరించి వారు మరింతగా తపాలా సేవ లను పొందేందుకు సహకరించాలని కోరారు. చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ మూర్తికి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా...రాజమండ్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనివాసరావు, రంపచోడవరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ లు తమ అభినందనలు తెలియజేశారు .

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
By Rajini Kumari 2026-04-10 11:46:48 0 180
Media Academy
Research Skills: Digging Deeper for the Truth
Research Skills: Digging Deeper for the Truth A journalist’s job is to go beyond...
By Media Academy 2025-04-29 07:49:05 0 3K
Andhra Pradesh
పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.
పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలో సూర్య రాక్స్ క్వారీ యాజమాన్యం అటవీశాఖ భూమికి ఏర్పాటు...
By Kothuru Murali 2026-01-26 07:16:20 0 233
SURAKSHA
Deven Bharti IPS: The Strategic Mind Behind Mumbai's Security
The Journey Begins "Effective policing is built on intelligence, public trust,...
By Fathima Safa 2026-07-21 04:33:41 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com