వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|

0
74

● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి

● నకిలీ స్క్రీన్‌షాట్‌ను నమ్మొద్దని విజ్ఞప్తి

● సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుపై దృష్టి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ

అల్వాల్, సెప్టెంబర్ 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఆయన వర్గాలు స్పందించాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్‌షాట్ నకిలీదని, అందులోని ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేకు సంబంధించినట్లుగా వైరల్ చేస్తున్న స్క్రీన్‌షాట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు డిజిటల్‌గా రూపొందించి వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ఆ స్క్రీన్‌షాట్‌లో పేర్కొన్న అంశంపై ఎలాంటి విచారణ లేదా నివేదిక ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

అల్వాల్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం కొత్తగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రయత్నాన్ని పక్కదారి పట్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వర్గాలు ఆరోపించాయి.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని ధృవీకరించకుండా నమ్మవద్దని, ఇలాంటి నకిలీ స్క్రీన్‌షాట్లను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అర్ధరాత్రి పరామర్శ హోమ్ మినిస్టర్ అనిత
*కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత*   *కార్యకర్త ఫోన్...
By Rajini Kumari 2026-01-05 11:53:18 0 267
SURAKSHA
Vijaya K IAS: Empowering Governance Through Dedicated Leadership
A distinguished 2013-batch Andhra Pradesh cadre IAS officer known for transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 10:42:33 0 139
Andhra Pradesh
సంక్షేమ హాస్టల్స్, లోకి విద్యార్థి సంఘాల నాయకుల నిషేధాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్
ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌ను ఉద్దేశించి ఆదోని DSF డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ శేఖర్...
By Boya Dasthagiri 2026-08-10 10:52:31 0 152
Andhra Pradesh
AP మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్...   తన కుటుంబ సభ్యులకు అవార్డులు రావడంపై లోకేష్...
By Rajini Kumari 2025-12-19 10:10:41 0 267
Andhra Pradesh
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర...
By Ratna Sekhar 2026-02-19 20:24:23 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com