పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత: చింతూరు డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి

0
80

పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చింతూరు డిఎఫ్ ఓ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదివారం చింతూరులో శ్రీ భాస్కర విద్యానికేతన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డిఎఫ్ఓ పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి చాలా ముప్పు ఉందని మట్టి గణపతి విగ్రహాలనే వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సిఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలు వల్ల ఎటువంటి నష్టం ఉండదని, విద్యార్థులకు చిన్నప్పటి నుండే పర్యావరణం మీద అవగాహన కల్పించాలని కోరారు. అలాగే ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతూ పండుగలు శాంతియుతంగా సాంప్రదాయంగా జరుపుకోవాలని అన్నారు. శ్రీ భాస్కర విద్యానికేతన్ కరస్పాండెంట్ చిరసాని వేణుగోపాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎకడమిక్ కోఆర్డినేటర్ త్రివీణ, ప్రిన్సిపాల్ రాంబాబు, ఉపాధ్యాయులు రమేష్, గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

 

#  Yadagiri 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను...
By Sunka Santhosh 2026-04-25 04:47:35 0 231
SURAKSHA
పాస్‌పోర్ట్ సేవలకు తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు
గర్వకారణం. దేశంలోనే ఉత్తమ పోలీసు పాస్‌పోర్ట్ ధ్రువీకరణ సేవలకు Telangana Police కి...
By Kalaga Sailaja 2026-06-30 05:50:47 0 77
International
War effect in india
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశంపై పడే ప్రభావాలు చాలా...
By G k Nookala 2026-03-01 08:01:18 0 173
SURAKSHA
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins  A Leader Driven by Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-08-01 13:13:12 0 303
SURAKSHA
Kona Sasidhar, IAS: Driving Digital Governance Excellence
A Visionary Civil Servant Leading Andhra Pradesh's Digital Transformation, Education Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-13 11:23:48 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com