Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

0
70

 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.  మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హాజరై ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజమైన మట్టితో, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుధా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
By Jeeru Kumar 2026-03-02 11:17:23 0 1K
Andhra Pradesh
రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి దేవినేని అవినాష్ రాష్ట్ర అధికారి పొట్లూరి దర్శిత్
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా...
By Rajini Kumari 2026-03-06 01:48:04 0 209
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 82
Andhra Pradesh
న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ
“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి...
By Chennaiah Kati 2026-07-11 13:28:39 0 99
Telangana
సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం
మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు   తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా...
By Pinnehasan Odela 2026-01-14 18:09:55 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com