Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

0
72

 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.  మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హాజరై ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజమైన మట్టితో, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుధా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: మరో 15 ఏళ్లు మనం ఇలాగే బలంగా నిలబడాలి: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: మరో 15 ఏళ్లు మనం ఇలాగే బలంగా నిలబడాలి: సీఎం చంద్రబాబు 11-02-2026 Wed...
By Pagadala Venkateswar 2026-02-11 11:41:46 0 216
Telangana
Sammakk🌷 సారలమ్మ జాతరలో తొలి ఘాట్టం మొదలైoది
*సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది.* జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత...
By CM_ Krishna 2026-01-14 17:47:12 0 483
Andhra Pradesh
చీరాలలో శక్తి యాప్ పై అవగాహన
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్...
By Vadlamudi NagaVenkat 2026-04-28 10:31:08 0 272
Andhra Pradesh
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ SC Cell కార్య దర్శి ( దావులూరి వెంకటేష్ )
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. ...
By VALLERU SIMHADRI 2026-09-10 16:22:48 0 186
Jammu & Kashmir
J&K Strengthens Agricultural and Horticultural Growth
Jammu & Kashmir continues to advance its agricultural and horticultural sectors through...
By Fathima Safa 2026-06-25 12:56:27 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com