Madanapalle: జాతీయ బ్యాంకుల్లో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ పొందిన కార్పొరేట్ల పేర్లు వెల్లడించాలని మదనపల్లెలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు.

0
54

మదనపల్లె: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మాఫీ పొందిన కోటీశ్వరులు, కార్పొరేట్ సంస్థల పేర్లను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 12 ఏళ్లలో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసినట్లు పేర్కొన్న ఆయన, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందడం లేదని విమర్శించారు. డిలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.కరువు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పేద రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా ప్రభుత్వాలు ముందుకు వెళితే నష్టపోతాయని చింతామోహన్ హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల. టౌన్ హాల్ .లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ..
బాపట్ల: బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రధమాంద్ర మహాసభ స్మారక విజ్ఞాన...
By Gadiyapudi Narendra 2026-03-15 13:46:38 0 611
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
By Benguluri Madhubabu 2026-03-08 13:19:01 0 228
Telangana
"అల్వాల్ మహిళా గర్జన: నాయకత్వంలో మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ నుండి హోరెత్తిన మహిళా గర్జన, చింతల మాణిక్య రెడ్డి...
By Sidhu Maroju 2026-04-23 11:38:59 0 236
Telangana
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
By Krishna Balina 2026-03-06 09:48:03 0 452
SURAKSHA
: Police Personnel Actively Participate in the Yoga Andhra 2026 Campaign
As part of the statewide "Yoga Andhra 2026" initiative, police personnel are actively...
By Kalaga Sailaja 2026-06-30 13:13:54 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com