*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్

0
87

 *పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు "నా దేశం - నా జాతి - నా బాధ్యత" అను అంశంపై వ్యక్తిత్వ నిర్మాణ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 1893 సంవత్సరంలో ఇదే రోజు అమెరికాలోని చికాగో నగరంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనంలో తన ప్రసంగంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేశారని కొనియాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిత్వ నిర్మాణాన్ని పెంపొందించడానికి నేషనల్ యూత్ ప్రాజెక్టు వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కటోర శ్రమ అంకితభావం పట్టుదల విజయానికి సోపానాలని సూచిస్తూ స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రవచనాలను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విలువలను సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరో అతిధి జిల్లా యువజన అధికారి శ్రీ జి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వివిధ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ సన్మార్గంలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శ్రీనివాస్, ఏ సి ఓ బి. సంపత్ కుమార్ ఏవో బి. శ్రావణ్ కుమార్, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. గోపి కృష్ణ, నేషనల్ యూత్ ప్రాజెక్ట్ బాధ్యులు కె. యాదవరాజు, ఎండి.తాహర్ పాషా అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు
ఏప్రిల్ నెలలో ఎండలతో అల్లాడే భాగ్యనగరంలో ఒక్కసారిగా హిమాలయాలు ఆవిష్కృతమయ్యాయి. కశ్మీర్‌లోని...
By Ponnala Srinivasrao 2026-04-29 01:47:03 0 179
Andhra Pradesh
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ...
By Pagadala Venkateswar 2026-02-11 11:28:30 0 179
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయ ప్రతిష్ట పారిశుద్ధ్య కార్మికులు చేతిలోనే ఉంది ఈవో సీనా నాయక్
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 22 జనవరి 2026   దేవాలయ ప్రతిష్ట పారిశుధ్య కార్మికుల...
By Rajini Kumari 2026-01-22 12:20:37 0 230
Andhra Pradesh
తిరుపతిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభకు హాజరై ప్రసగించాను.
తిరుపతిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభకు హాజరై ప్రసగించాను. లక్ష...
By Chennaiah Kati 2026-06-14 07:22:04 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com