వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
Posted 2026-09-11 12:06:43
0
203
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. మండలంలోని గ్రామాల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.మండపాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్లు, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దం, అసభ్యకర కార్యక్రమాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించి వినాయక చవితిని సుఖశాంతులతో జరుపుకోవాలని డీఎస్పీ శివ నారాయణ స్వామి సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
...
పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన...
చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...
చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి...
నందిగామ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం
నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని...
Madhya Pradesh Expands Sports Development Across Stat
Madhya Pradesh continues to strengthen its sports ecosystem through investments in modern...