నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఘనస్వాగతం.

0
120

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, వై. సత్యకుమార్ సాదరంగా స్వాగతం పలికారు.

 

అక్షర విద్యాలయం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన యోగికి మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, కుమారుడు హర్షవర్ధన్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం యోగి అక్షర విద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.

 

అక్కడ నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీయువకులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారికి అందుతున్న సాంకేతిక శిక్షణ, భవిష్యత్ అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను, అక్షర విద్యాలయం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు చేస్తున్న కృషిని యోగి ఆదిత్యానాథ్ ప్రశంసించారు. ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన స్కేటింగ్ ప్రదర్శనను కూడా ఆయన ఆసక్తిగా తిలకించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra Chandrababu Naidu welcomes India US trade deal భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...
By Pagadala Venkateswar 2026-02-03 08:44:19 0 177
Andhra Pradesh
Vangalapudi Anitha: మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది.. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి మంత్రి అనిత అభినందనలు.
విధి నిర్వహణలో చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి జయశాంతి చర్య పోలీసులపై ప్రజల...
By Pagadala Venkateswar 2026-01-20 10:53:20 0 231
Andhra Pradesh
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు...
By Chennaiah Kati 2026-07-15 13:10:09 0 114
Telangana
మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం...
By Avunoori Mahesh 2026-07-19 01:06:55 0 250
Telangana
అగన్వాడీ టీచర్స్కి మొబైల్స్ పంపిణి చేసిన ఎంమ్మెల్యే
మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 423 మొబైల్ ఫోన్లు అంగన్వాడీ...
By Avunoori Mahesh 2026-04-07 09:51:25 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com