Bharat Aawaz

రాయచోటిలో ముగ్గురు మంత్రుల కీలక సమీక్ష

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
5 min read
0
Comments
321
Views

*మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అభివృద్ధి, స్థానిక ఎన్నికలపై కీలక సమీక్ష*

 

*అన్నమయ్య జిల్లా | రాయచోటి నియోజకవర్గం | 05-09-2026*

 

రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు *మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు,* అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు *బీసీ జనార్దన్ రెడ్డి గారు,* విద్యుత్ శాఖ మంత్రివర్యులు *గొట్టిపాటి రవికుమార్ గారు* ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, విద్యుత్, రహదారులు, తాగునీరు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రులు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి, వాటికి సత్వర పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

“అభివృద్ధి ఆగకూడదు.. ప్రజా సంక్షేమం ఆగకూడదు.. రాయచోటి ప్రగతి పరుగులు తీయాలి” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి, రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

అలాగే రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎలా ముందుకు సాగాలి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

 

ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధిని ఒక వైపు.. సంక్షేమాన్ని మరో వైపు.. ప్రజా సేవను ప్రధాన అజెండాగా చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

రాయచోటి అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సంక్షేమమే ధ్యేయం.. కూటమి ఐక్యతే బలం అనే సంకల్పంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రుల ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు, కార్యాచరణపై చర్చ జరిగింది.