వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి

0
112

 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్కి ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న 15 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *మౌలాలి తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు అందరు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు, ప్రధానంగా అధిక లక్ష్యాలు విధించడం, ఆ లక్ష్యాలను ప్రతివారం,ప్రతి నెల అధిగమించాలని తీవ్రమైన ఒత్తిడి, ఏక కాలంలో ఆఫ్ లైన్, ఆన్ లైన్ నమోదు చేయాలని చెప్పడం మూలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురి అవుతున్నారు, కావున పని ఒత్తిడిని తగ్గించాలని విజ్ఞప్తి చేసారు,రెగ్యులర్ ఏ.ఎన్.ఎంలకు సంబంధించి ఎల్.హెచ్.వి ట్రైనింగ్ పూర్తి కాలేదని 12,18 సంవత్సరాల స్పెషల్ ప్రమోషనల్ పోస్ట్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయడం లేదు, ఫలితంగా ఏఎన్ఎంలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. కావున గతంలో మాదిరిగా ప్రభుత్వ ఖర్చుతో ఎల్.హెచ్. వి ట్రైనింగ్ ఇప్పించాలి.ట్రైనింగ్ ఇచ్చేలోపు పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలి. అదేవిధంగా అర్హులైన ఏ.ఎన్.ఎంలకు సూపర్వైజర్ ప్రమోషన్స్ కల్పించాలి,గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 1931 ఏపీ హెచ్ఎ ఫిమేల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలి, రెగ్యులర్ అయి మిగిలి పోయిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏ.ఎన్.ఎం. లందరికి వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్రధానంగా ప్రతి పనికి ఆభా లింకింగ్ వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి, ఈ ఆభా లింకింగ్ విధానాన్ని తీసివేయాలి. జీతంతో కూడిన ఎఫ్ టీఏ ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి ఏఎన్ఎం లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి తగిన సూచనలు పంపించి మాకు న్యాయం చేయగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్ఎంలు పద్మావతి, మంగు భాయి, వసంత, విజయదర్షిన్, కృష్ణవేణి యేసు వర, సుజాత, నరసమ్మ, మీనా తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల అభివృద్ధి మా కర్తవ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు....
By Vadlamudi NagaVenkat 2026-03-16 13:19:26 0 677
Andhra Pradesh
Andhra pradesh former minister mudragada padbhanam expired
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం...
By G k Nookala 2026-07-14 15:22:58 0 203
Uttarkhand
Uttarakhand Boosts Industrial Investment and MSMEs
Uttarakhand continues to promote industrial investment and MSME development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:04:51 0 91
Andhra Pradesh
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన...
By Chennaiah Kati 2026-06-20 08:37:58 0 131
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్.
వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు...
By Pagadala Venkateswar 2026-07-22 11:37:37 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com