22ఏపై బీజేపీ సమర భేరీ.. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా.|

0
101

● ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన

● మహాధర్నాను విజయవంతం చేయడంపై ఈటల రాజేందర్ సమన్వయ సమావేశం

● పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న బీజేపీ శ్రేణులు

ఆల్వాల్, సెప్టెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధిత జాబితా 22ఏ అంశానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు.

ప్రజల సమస్యలకు అండగా నిలుస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఆందోళన చేపట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

మహాధర్నాను విజయవంతం చేసేందుకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ సెల్‌ల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, మోర్చాల పదాధికారులతో ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలోని తన నివాసంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాధర్నాకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా కార్యాచరణపై చర్చించారు. ప్రజల సమస్యలపై నిర్వహిస్తున్న ఆందోళనను విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీజేపీ నాయకులు, కార్యకర్తలు హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:56:38 0 881
SURAKSHA
మహిళలకు డిజిటల్ రక్షణ: సురక్షితమైన ఆన్‌లైన్ సూచనలు
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలకు ఆన్‌లైన్ భద్రత చాలా కీలకం. మీ సామాజిక మాధ్యమ (Social Media)...
By Kalaga Sailaja 2026-06-24 09:16:15 0 138
Andhra Pradesh
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ...
By Pagadala Venkateswar 2026-06-20 04:41:10 0 109
Telangana
పేద కుటుంబనికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ కు చెందిన లక్ష్మికి...
By Avunoori Mahesh 2026-04-29 11:10:32 0 217
Andhra Pradesh
గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం.
  గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం...
By Pagadala Venkateswar 2026-04-10 06:37:24 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com