ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం ఎమ్మెల్యే కోవలక్ష్మి ధ్వజం

0
384

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, ప్రజలను ఘోరంగా దగా చేసిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆసిఫాబాద్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, నేటికి 1000 రోజులు గడిచినా ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్...
By Gadiyapudi Narendra 2026-01-23 16:00:44 0 253
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:43:13 0 2K
Ladakh
Renewable Energy and Solar Power Growth in Ladakh
Ladakh is emerging as a key center for renewable energy development in India, with a strong focus...
By Fathima Safa 2026-06-24 09:45:19 0 153
Telangana
అమ్మవారి సేవలో భక్తజనం.. బోనాల పండుగ సందడి.|
● అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ ● అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల...
By Sidhu Maroju 2026-08-15 16:46:20 0 128
Telangana
వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామసభలో వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికల భాగంగా.... భారత్ అవాజ్ న్యూస్: 8 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-08 07:49:31 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com