డిగ్రీ లేదు.. వైద్యం మాత్రం చేస్తున్నారు.|

0
103

● అర్హతలు లేకుండానే క్లినిక్‌ల నిర్వహణ

● ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్

● భారీగా అల్లోపతి మందులు, వైద్య పరికరాలు స్వాధీనం

అల్వాల్, సెప్టెంబరు 2: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యుల దందా గుట్టురట్టైంది. ఎలాంటి వైద్య విద్యార్హతలు, డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ అల్లోపతి వైద్యం చేస్తున్న ఐదుగురిని కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పక్కా సమాచారంతో కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో తనిఖీలు, దాడులు నిర్వహించారు. 

ఈ సందర్భంగా మేడ్చల్ పరిధిలో ఇద్దరు, జగద్గిరిగుట్ట, పేట్ బషీరాబాద్, సూరారం పరిధుల్లో ఒక్కొక్కరి చొప్పున మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని రోగులను పరీక్షిస్తూ అల్లోపతి మందులు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి భారీగా మందులు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

వైద్య అర్హతలు, అవసరమైన అనుమతులు లేకుండా ప్రజలకు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నకిలీ వైద్యులు, అనధికార క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్
*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *...
By Rajini Kumari 2026-01-20 11:07:57 0 196
SURAKSHA
Manoj Ahuja IAS: Steering Odisha Towards Excellence
A visionary 1990-batch IAS officer of the Odisha Cadre, Manoj Ahuja has built an extraordinary...
By Lokeshwari Panthadi 2026-07-27 05:27:30 0 159
Telangana
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-12-07 15:50:52 0 331
Andhra Pradesh
Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు.
Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు 31-01-2026 Sat 21:43 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-01 08:48:17 0 205
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com