ఓటర్ల హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
Posted 2026-09-01 14:27:42
0
428
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై హియరింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.మంగళవారం నాడు తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్వహిస్తున్న నోటీసులు, రికార్డు రిజిస్టర్లు, అలాగే ఓటర్లు సమర్పించిన వివిధ ధ్రువపత్రాలను ఆమె నిశితంగా తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ. కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ మొత్తం సాగాలని స్పష్టం చేశారు. విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి.. ఫుడ్ కమిషన్ ఛైర్మన్.
ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీలు, చౌక ధరల...
Heatwave Impact & Education
As a blistering heatwave grips northern India, the Haryana government has announced a state-wide...
ఘనంగా మొహరం పండగ.
కొందుర్గు భారత్ ఆవాజ్:
కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు...
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking..
విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తాగునీటి సమస్యను కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరిష్కరించారు.
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య...