మైనర్లకు సిగరెట్లు.. ఇద్దరు అరెస్ట్.|

0
102

● యజమాని, ఉద్యోగి అరెస్ట్

● రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

● 22 సార్లు నిఘా పెట్టిన ఈగిల్ ఫోర్స్

అల్వాల్, ఆగస్టు 30: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్ యజమాని, ఉద్యోగిని ఈగిల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం మేరకు.. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని లిమ్రా పాన్ మహల్‌లో 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఈగిల్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. దీనిపై ఆధారాలు సేకరించేందుకు అధికారులు 22 సార్లు నిఘా పెట్టినట్లు తెలిపారు.

అనంతరం ఈగిల్ ఫోర్స్ బృందం, బోయిన్‌పల్లి పోలీసులు కలిసి దుకాణంపై దాడి చేశారు. దుకాణ యజమాని మహ్మద్ యూసుఫ్ ఉద్దీన్ గౌరీ (65), ఉద్యోగి మహ్మద్ రెహాన్ అలీ (19)ను అదుపులోకి తీసుకున్నారు.

దుకాణంలో తనిఖీలు నిర్వహించి మార్ల్‌బోరో, అమెరికన్, క్లాసిక్, ఎడిషన్ గోల్డ్‌ఫ్లేక్, చామ్స్ ఫ్లేక్ తదితర బ్రాండ్లకు చెందిన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు .60 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న ఇద్దరితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 314
Telangana
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
By Gujile Ramu 2026-04-27 23:47:02 0 172
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 1K
Andhra Pradesh
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు...
By Mobbu Venkatramana 2026-01-26 14:50:53 0 590
Telangana
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-09-01 09:04:42 0 390
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com