చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

0
172

చింతూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.మణిమాల గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు భాషకు,సరళత,సమానత్వం, ప్రజల నాఢీకి దగ్గరగా ఉండేలా చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు అని, పండితులకే పరిమితమైన గ్రాంథిక భాషను కాదని, సామాన్యులు మాట్లాడే వాడుక భాషను ( వ్యవహారిక భాష ) సాహిత్యానికి, చదువుకు అనుకూలంగా మార్చాలని ఆయన పోరాడారన్నారు. గిడుగు రామ్మూర్తి చేసిన కృషి వల్ల చదువు అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర దేశంలో వ్యవహారకభాషా ఉద్యమానికి మూలపురుషుడు గిడుగు రామ్మూర్తి అని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మకత శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి విద్యను అందేలా చేశారని, శిష్ట జన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన గిడుగు రామ్మూర్తి అనీ కొనియాడారు. తెలుగు విభాగధిపతి కె.లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడని,ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి, ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ వై.పద్మ, డాక్టర్ జి.ఝాన్సీ, ఆర్ మౌనిక, జి.సాయికుమార్ బి. శ్రీనివాసరావు, కె.కీర్తి, ఆర్.కిరణ్మయి, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
SURAKSHA
Utkal Ranjan Sahoo: Leading Rajasthan Police with Vision
The Journey Begins "The strength of a police force lies not only in enforcing the law but in...
By Fathima Safa 2026-07-21 07:30:10 0 94
Andhra Pradesh
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం వైద్యశాలలో సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలి రోగులు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ
బాపట్ల: పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని...
By Gadiyapudi Narendra 2026-02-12 13:09:39 0 202
Maharashtra
Agricultural Development and Farmer Welfare in Maharashtra
Agricultural development and farmer welfare remain key priorities in Maharashtra's growth...
By Fathima Safa 2026-06-23 07:36:16 0 289
Andhra Pradesh
Annamayya: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కలికిరి శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ముందస్తు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా...
By Pagadala Venkateswar 2026-07-31 09:54:06 0 87
Telangana
పేద కుటుంబానికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కొలకని నాగ జ్యోతి గారికి ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-07 15:54:30 0 398
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com