కల్వర్టు అనుమతికి లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈ.

0
97

నెల్లూరు జిల్లాలో ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ. 3 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఈఈ మహేశ్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ నారాయణరాజులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే.. కలువాయి మండలం మద్దూరుపల్లి గ్రామానికి చెందిన రైతు అంబటి చిరంజీవి, తన పొలం వద్ద గల కాలువపై కల్వర్టు నిర్మించుకునేందుకు అనుమతి (ఎన్ఓసీ) కోసం నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించారు. అయితే, ఆ ఎన్ఓసీ జారీ చేసేందుకు సదరు అధికారులు రూ. 4 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు.

 

దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి వ్యూహం ప్రకారం, గురువారం బాధితుడి నుంచి రూ. 3 లక్షలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ముగ్గురు అధికారులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఈ ఘటన జిల్లా నీటిపారుదల శాఖలో తీవ్ర కలకలం రేపింది.                          

Search
Categories
Read More
SURAKSHA
: Janasevaka: Bringing Essential Police Services to Your Doorstep
The 'Janasevaka' initiative represents a transformative shift in community policing, designed to...
By Kalaga Sailaja 2026-06-26 10:44:58 0 97
Uncategorized
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession In the heart of Mumbai’s fast-paced...
By BMA ADMIN 2025-05-23 09:39:20 0 2K
Chandigarh
Chandigarh Advances Education Through Digital Innovation
Chandigarh is making significant progress in the education sector through digital learning...
By Fathima Safa 2026-06-25 11:25:36 0 201
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె కురవంకలో విజయ భారతి క్రికెట్ అకాడమీ ఘనంగా ప్రారంభం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ...
By Pagadala Venkateswar 2026-07-11 04:02:11 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com