శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు

0
128

 

 

చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం* అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో *రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు* పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

 

శ్రీనివాస స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

 

మంత్రి దంపతులకు ఆలయ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులతో కలిసి మంత్రి దంపతులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

 

 శ్రీనివాస కళ్యాణం అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం *మంత్రి కుమారుడు మండపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు* ప్రారంభించి తన చేతులతో భక్తులకు వడ్డించారు..

 

ప్రజలందరి ఇళ్లలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, శ్రీనివాస స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన...
By Benguluri Madhubabu 2026-05-08 12:59:24 0 271
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం.
పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం...
By Kothuru Murali 2026-01-24 07:48:46 0 222
Andhra Pradesh
మదనపల్లె: న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ.
గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం...
By Pagadala Venkateswar 2026-03-06 03:07:57 0 192
SURAKSHA
Jitendra Singh Raje, IAS: Driving Sikkim's Governance Forward
A 2007-batch Sikkim cadre IAS officer whose administrative excellence, development-oriented...
By Lokeshwari Panthadi 2026-07-25 05:47:00 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com