పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు.

0
92

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ, స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి ఏడుగురు మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు.

 

 

 

కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సుమారు ఏడు రోజుల క్రితం ఒక బోటులో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని వస్తున్న క్రమంలో నర్సాపురం మండలం చిన్నలంక సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తూ ఇసుక దిబ్బను ఢీకొట్టి సముద్రంలో బోల్తా పడింది. దీంతో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు.

 

సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు ప్రాణాలను రక్షించుకోవడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తూ చేసిన ఆర్తనాదాలను చిన్నలంక గ్రామస్తులు విన్నారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టి, ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు బాధితులను చిన్నలంకలోని పునరావాస కేంద్రానికి తరలించి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Search
Categories
Read More
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 323
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 806
SURAKSHA
Ishita Roy, IAS: Inspiring Leadership Through Public Service
The Journey Begins "True leadership is measured not by authority, but by the positive impact it...
By Fathima Safa 2026-07-14 13:17:06 0 149
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-01-22 06:32:17 0 186
Andhra Pradesh
పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-03-20 05:41:07 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com