ఏపీలో కీలక రహదారికి కేంద్రం నిధులు మంజూరు.. గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.

0
83

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీలకమైన జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని అందిస్తోందని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి-365BB విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.840.41 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్రమంత్రి గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పొగాకు, చెరకు, పామాయిల్, ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలు కలుగుతుందని అన్నారు.

 

Search
Categories
Read More
SURAKSHA
Dr. N. Yuvaraj IAS: Leading Innovation and Industrial Growth
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in industrial development,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:48:31 0 214
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:సదుం మండలంలో పేకాట రాయుళ్ల అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సోమవారం రాత్రి సదుం ఎస్సై...
By Kothuru Murali 2026-02-17 08:39:19 0 178
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 217
Andhra Pradesh
మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.
అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి. కృష్ణప్ప నాయుడు...
By Pagadala Venkateswar 2026-02-24 07:55:31 0 204
Telangana
"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర...
By Sidhu Maroju 2026-05-01 13:50:59 0 389
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com