75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే కూల్చివేత తప్పదు : సీఎంసీ కమిషనర్ సృజన
75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే తొలగిస్తామని ప్రకటించిన సీఎంసీ కమిషనర్ సృజన - సాధారణంగా 75 గజాలలోపు ఇళ్లకు అనుమతి అక్కర్లేదని ప్రకటన - సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాల గుర్తింపు
ప్రజావాణిలో చాలా ఫిర్యాదులు వచ్చాయని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించి ఉండకూడదనన్నారు. సాధారణంగా 75 గజాల్లోపు ఇళ్లకు అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశారు. 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే తొలగిస్తామని హెచ్చరించారు.
నోటీసులు ఇవ్వనక్కర్లేదు : 75 గజాలు దాటిన ఇళ్లకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని, ఈ 2 విభాగాల్లో నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణంలోని ఇళ్లు తొలగించాలని నిర్ణయించినట్లు సృజన స్పష్టం చేశారు. నోటీసుల ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణంలోని ఇళ్లు తొలగిస్తామని హెచ్చరించారు. సాయంత్రం వరకు నిబంధనలు ఉల్లంఘించిన ఇళ్ల జాబితా రూపొందిస్తామని, ఇంట్లో నివాసం ఉన్న వారికి మాత్రమే నోటీసులు ఇవ్వాలని, నిర్మాణంలో ఉన్న అక్రమ ఇళ్లకు నోటీసులు ఇవ్వనక్కర్లేదని పేర్కొన్నారు. పార్కులో నిర్మించిన ఇల్లు ఖాళీ చేయాలని మధ్యాహ్నం 2 వరకు గడువు ఇచ్చామని తెలిపారు.
అనుమతులిస్తే అధికారులు బాధ్యులవుతారు : అంజయ్యనగర్ పరిసరాల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాల తొలగించామని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణానికి అనుమతులిస్తే అధికారులు బాధ్యులవుతారని హెచ్చరించారు. చాలా వరకు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతాయని, అక్రమ నిర్మాణాలు పర్యవేక్షించాల్సిన అధికారులపైనా చర్యలు ఉంటాయాని తెలిపారు. పూర్తిగా అనుమతులు లేని ముందుగా నిర్మాణాలపై దృష్టిపెట్టామని అన్నారు.
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ విభాగానికి పూర్తి అధికారాలు : అక్రమ నిర్మాణాల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని, హైడ్రా వంటి విభాగాలను అనుమతించాలని తెలిపారు. ఫిర్యాదులకు అనుగుణంగా పర్యవేక్షణకు సిబ్బంది ఉండాలని, పట్టణ ప్రణాళిక విభాగం బలోపేతంపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ సిబ్బంది హైడ్రాకు చెప్పామనడం తప్పేనని అన్నారు. హైడ్రాకు చెప్పామంటూ సిబ్బంది తప్పించుకోవడమే అవుతుందని, అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ విభాగానికి పూర్తి అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz