బాలికల భద్రత,సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం

0
375

మహబూబాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఎస్పీ డా. పి.శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం సేవలు మహిళా భద్రతపై షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

 షీ టీం సేవలు – బాలికలకు భద్రతపై అవగాహన 

షీ-టీం ఎస్‌ఐ సునంద మాట్లాడుతూ... షీ టీం విధులు, బాధ్యతలు, షీటీంను ఏ విధంగా సంప్రదించాలి, షీ టీం సిబ్బంది నిర్వహించే విధులు, మహిళలు, బాలికల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించి, గోప్యతతో ఎలా పరిష్కరిస్తారనే అంశాలను వివరించారు. అలాగే POCSO Act ప్రాముఖ్యత, బాలికల రక్షణకు చట్టపరమైన భద్రత, T-Safe App వినియోగం గురించి అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థినులు తమ లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో, శ్రద్ధగా చదువుకోవాలని, తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సునంద సూచించారు.

 సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం 

సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కరుణాకర్ మాట్లాడుతూ... వివిధ రకాల సైబర్ నేరాల గురించి విద్యార్థినులకు వివరించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTPలు వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని, సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

 భరోసా కేంద్రం సేవలపై అవగాహన 

భరోసా కేంద్రం సిబ్బంది భరోసా కేంద్రం అందించే సేవలు,విధులు, బాధ్యతల గురించి విద్యార్థినులకు వివరించారు. మహిళలు, బాలికలు ఏవైనా వేధింపులు, హింస లేదా ఇతర సమస్యలకు గురైనప్పుడు భరోసా కేంద్రం ద్వారా పొందగల సహాయం, కౌన్సెలింగ్, ఇతర సేవల గురించి అవగాహన కల్పించారు.

 మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి 

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బంది మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి, అది ఏ విధంగా జరుగుతుంది, అక్రమ రవాణాకు గురయ్యే పరిస్థితులు ఏమిటి, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.బాలికలు చట్టాలపై అవగాహన కలిగి, సైబర్ నేరాలు, ఇతర ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ భద్రతతో పాటు సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు:112,
మహబూబాబాద్ షీ టీం నెంబర్ 8712656935,
సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930,చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్: 1098,మహిళ హెల్ప్ లైన్ నెంబర్ 181, భద్రపరుచుకొని సమయానికి కాల్ చేయాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, షీటీం సిబ్బంది రమేష్, పార్వతి, సుధారాణి, ప్రియాంక, AHTU సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నాయక్, అరుణ, భరోసా సిబ్బంది మౌనిక, బేబీ,అధ్యాపక సిబ్బంది, సుమారు 600 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ‎K. Chandrashekar Rao కీలక నిర్ణయం...
By Ponnala Srinivasrao 2026-04-29 02:02:14 0 149
Andhra Pradesh
ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు
ఈ రోజు సంక్రాంతి  పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో...
By Mobbu Venkatramana 2026-01-15 05:50:33 0 635
Andhra Pradesh
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన...
By Kothuru Murali 2026-05-24 17:30:51 0 110
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 10:34:48 0 2K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ: రొంపిచర్ల లో ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు బుధవారం రొంపిచర్ల లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-20 06:07:46 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com