చింతూరు: పోలవరం నిర్వాసితుడికి అన్యాయం – నోటీసులో ఒకలా... ఖాతాలో మరోలా!

0
157

పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీలో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అవార్డు నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని ఇవ్వకుండా, రూ. 4,44,858/- తక్కువగా జమ చేసి బాధితుడిని మానసిక వేదనకు గురిచేస్తున్న ఉదంతం చింతూరు బి.సి. కాలనీలో వెలుగుచూసింది. చింతూరు బి.సి. కాలనీకి చెందిన పోలవరం నిర్వాసితుడు షేక్ జానీకి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం ఖాతాలో జమ అయ్యింది. అయితే, మిగిలిన నిర్వాసితులందరికీ అవార్డు నోటీసు ప్రకారం పూర్తి మొత్తం జమ కాగా, తనకు మాత్రం రూ. 4.44 లక్షలు తక్కువగా పడ్డాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్లను వివరణ కోరగా, తమ వైపు నుంచి పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. మిగిలిన మొత్తానికి బిల్లు పెడతామని ఎస్డీసీ (SDC) హామీ ఇవ్వడంతో, బాధితుడు మూడు నెలల పాటు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఆ తర్వాత ఉన్నట్టుండి “వాల్యుయేషన్ మర్చాం” అని మాట మార్చారని, అయితే మారిన వాల్యుయేషన్‌కు సంబంధించి ఏ విధమైన నోటీసూ తమకు చూపించలేదని బాధితుడు తెలిపారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) సమక్షంలో సంబంధిత సిబ్బంది తమదే పొరపాటని అంగీకరించి, మిగిలిన మొత్తానికి ‘డ్రాఫ్ట్ అవార్డు’ సిద్ధం చేసి సంతకాలు కూడా చేశారు. అయినప్పటికీ ఎస్డీసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ న్యాయాన్ని అడ్డుకుంటున్నారని నిర్వాసితుడు ఆరోపిస్తున్నారు. చివరకు ధవళేశ్వరం PIP వద్ద కూడా అధికారుల పొరపాటేనని తేలినప్పటికీ, పరిష్కరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోయారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తూ తప్పించుకోవడం తీవ్రమైన అన్యాయమని బాధితుడు షేక్ జానీ వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిలిచిపోయిన రూ. 4,44,858/- పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
*చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:27:29 0 547
SURAKSHA
Apoorva IAS: Transforming Governance Through Public Service
From district administration and public health to agriculture, rural development and disaster...
By Lokeshwari Panthadi 2026-07-25 12:35:23 0 244
Andhra Pradesh
నిమ్మనపల్లె పీహెచ్సీ తనిఖీ: ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO ఆదేశం.
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం నిమ్మనపల్లె పీహెచ్‌సీని...
By Pagadala Venkateswar 2026-04-17 03:33:21 0 156
Telangana
"మైనంపల్లి ఆదేశాలతో రంగంలోకి తోట లక్ష్మీకాంత్ రెడ్డి.. కనాజిగూడలో పెండింగ్ పనులపై పాదయాత్ర!"
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 135వ (old) డివిజన్ కనాజిగూడ ఇంద్రనగర్ కాలనీ...
By Sidhu Maroju 2026-05-21 08:22:06 0 156
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com