"మైనంపల్లి ఆదేశాలతో రంగంలోకి తోట లక్ష్మీకాంత్ రెడ్డి.. కనాజిగూడలో పెండింగ్ పనులపై పాదయాత్ర!"

0
155

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 135వ (old) డివిజన్ కనాజిగూడ ఇంద్రనగర్ కాలనీ మెయిన్ రోడ్డులోని పెండింగ్ పనుల సమస్యను స్థానికులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వివరించారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంద్రనగర్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. 

ఈ సందర్భంగా కాలనీలోని డ్రైనేజీ సీవరేజ్ లైన్, వాటర్ లైన్ సమస్యలను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ నాయకులు సంతోష్ సాగర్, కంటెస్టెంట్ కార్పొరేటర్ సంజీవ కుమార్, ఏ బ్లాక్ అధ్యక్షులు శేఖరం, డివిజన్ అధ్యక్షులు సుదేశ్ చంద్, మల్లెల శివ, సంజు గౌడ్, ఉదయ్ కుమార్, లడ్డు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, శివకుమార్, కిట్టు, బల్వంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. 

అలాగే డివిజన్ నాయకులు రాజన్, రాజకుమార్, జోసఫ్, రాము, మల్లేష్ యాదవ్, బాల నరసింహ, అంకుల్ రాజేందర్, కుమార్, మహిళా నాయకురాళ్లు పద్మ, లక్ష్మి, మీనా తదితరులు ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
By Chennaiah Kati 2025-12-27 09:10:02 0 467
Telangana
మేము గోల్ కొట్టడం ఖాయం...హరీష్ రావు
మేము గోల్ కొట్టడం ఖాయం ‎ ‎బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ‎కేసీఆర్ సీఎం అవ్వడం...
By Ponnala Srinivasrao 2026-03-25 11:00:53 0 250
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విషయం: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం  విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన...
By Rajini Kumari 2026-03-03 11:59:07 0 200
Andhra Pradesh
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం |
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Bharat Aawaz 2025-09-20 10:07:41 0 2K
Andhra Pradesh
మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత గద్దె రామ్మోహన్
*మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత* *డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీలో గద్దె రామమోహన్* ***...
By Rajini Kumari 2026-01-28 12:51:50 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com